హోళికా దహనం ఎందుకు చేస్తారో తెలుసా..?

హోళికా దహనం ఎందుకు చేస్తారో తెలుసా..?

ఊర్కొండ, ఆంధ్రప్రభ : హోలీ అనేది రంగులు ప్రేమ వసంతాల పండుగగా జరుపుకునే ప్రధానమైన హిందూ పండుగ. ఇది దేవతలైన రాధాకృష్ణుల శాశ్వతమైన దైవిక ప్రేమను తెలుపుతుందని ఊరుకొండపేట శ్రీ పబ్బాతి ఆంజనేయ స్వామి దేవస్థానం అర్చకులు అన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సోమవారం అనగా నేడు మార్చ్ 2, 2026 రోజు రాత్రి 8 గంటలకు కామ దానం తెల్లారి పౌర్ణమి, రేపు అనగా మంగళవారం మార్చి 3 న 2026 వసంత కేలి (హోళీ పండుగ). రంగుల పండుగ. కామదానం ఎందుకు చేస్తారు అంటే హిందూ సాంప్రదాయ ప్రకారం.. పూర్వం హోళికా అనే స్త్రీ ప్రహ్లాదుని రక్షిస్తుంది. అయితే.. ఆ హోళిక స్త్రీ ఆ మంటల్లో చనిపోతుంది. ఈ విధంగా హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. అందుకే ప్రతి సంవత్సరం పాల్గొన శుక్ల పౌర్ణమి ముందు రోజు రాత్రికి కామదానం లేక భోగి మంటలు అనే పేర్లతో పిలుస్తారు. పౌర్ణమి రోజు రంగుల కేలి చిన్నా పెద్దలు తారాతమ్యం లేకుండా స్త్రీలు అందరూ కలిసి సంతోషాలతో ఒకరికొకరు రంగులు వేసుకొని ఆనంద ఉత్సవాలతో హోలీ పండుగను ఈ రంగుల కేలిని సంతోషాలతో జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు.

Leave a Reply