గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి

గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి

  • తహసీల్దార్‌కు వినతి పత్రం అందించిన హిందూ సంఘం

ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : దేశంలో గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని, విశ్వహిందూ పరిషత్ జిల్లా మందిర్ అర్చక రోహిత్ సహప్రముఖ్ గుండెబోయిన రామకృష్ణ స్థానిక సర్పంచ్ వాసం సుస్మిత సోమవారం తాహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ సారయ్యకు వినతి పత్రాన్ని సమర్పించడం జరిగిందని వాసం శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. హైందవ సంప్రదాయాల్లో గోమాతకు విశిష్టస్థానం ఉందన్నారు.

గోసంరక్షణ ప్రతి పౌరుని బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.గోమాత పంచగవ్యం ఔషధం, వ్యవసాయం,ఆధ్యాత్మిక రంగాలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం వెంటనే గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించి, గోహత్య నిషేధ చట్టాన్ని దేశవ్యాప్తంగా కఠినంగా అమలు చేయాలని కోరారు. ప్రజల్లోని గోమాత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకే సంతకాల సేకరణ చేపట్టినట్లు వివరించారు.

భారతదేశం నుండి గోవద పూర్తిగా నిర్మూలించాలి, ఆవుపేడ గోమూత్రం దివ్యఔషధాలు కావడంతో,విశరహిత వ్యవసాయం ఆవు పునాది, ఆవు జాతీయప్రాణి హోదాతో రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వనపర్తి రమేష్, గొగ్గెల రామకృష్ణ, మెస్సు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply