వేడిమి విషాదం… చికిత్స పొందుతూ మహిళ మృతి

వైరా, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డుకు చెందిన బత్తుల లక్ష్మమ్మ (60) వడదెబ్బ కారణంగా మృతి చెందారు.

ఈ నెల 20న ఖమ్మం సమీపంలోని ఓ వివాహ వేడుకకు హాజరై ఇంటికి వచ్చిన అనంతరం ఆమెకు అస్వస్థత కలిగింది. ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

అప్పటి నుంచి చికిత్స పొందుతున్న లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం 8 గంటల సమయంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. లక్ష్మమ్మ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Leave a Reply