8వ పీఠాధిపతి జగద్గురు చెన్న బసవ రాజేంద్ర స్వామి శివైక్యo..

ఉరవకొండ రూరల్, జులై18 (ఆంధ్రప్రభ ): ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన ఉరవకొండలోని శ్రీ గవి మఠం 8వ పీఠాధిపతి జగద్గురు చెన్న బసవ రాజేంద్ర స్వామి ( 98 ) శనివారం తెల్లవారు జామున కర్ణాటకలోని బళ్లారిలో శివైక్యం చెందారు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బళ్లారి నుండి ఆయన పార్థివ దేహాన్ని ఉరవకొండ మఠానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీ చెన్న బసవ రాజేంద్ర స్వామి శివైక్యంతో భక్తులు, శిష్యులు, పీఠాధిపతులు, ప్రజా ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.