కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థికి ప్రశంసా పత్రం
కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థికి ప్రశంసా పత్రం
రాయపోల్, ఆంధ్రప్రభ:
సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా మండలంలోని జడ్పీహెచ్ఎస్ రాయపోల్ పాఠశాల విద్యార్థి నిశాంత్ రెడ్డి కలెక్టర్ హైమావతి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకొని ప్రతిభ చాటాడు.
మొక్కజొన్న పొట్టు నుంచి బయో ప్లాస్టిక్ తయారీ అంశంపై రూపొందించిన ప్రాజెక్టు ఇటీవల జరిగిన సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో విశేష ప్రశంసలు అందుకొని అందరినీ ఆకట్టుకుంది.
విద్యార్థి ప్రతిభను గుర్తించిన జిల్లా అధికారులు విద్యా వారోత్సవాల వేదికగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ రాయపోల్ ప్రధానోపాధ్యాయులు ఎం. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. విద్యార్థి సాధించిన విజయంపై ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
