చెన్నూర్, ఆంధ్రప్రభ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ ఉదయం నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ తమ తమ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటిని పరిరక్షించినట్లయితే భావితరాలకు శ్రేష్ఠమైన వాయువును అందించిన వారమవుతామన్నారు. అనంతరం మున్సిపల్ సిబ్బందికి మాస్క్, క్యాప్ లు, తదితర సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణ, సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ADB |పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : ఎమ్మెల్యే వివేక్
