బిజెపి అభ్యర్థులను గెలిపించండి

బిజెపి అభ్యర్థులను గెలిపించండి
- నిర్మల్ రోడ్ షో లో బిజె హెల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
- 36.37.38.వార్డు బిజెపి అభ్యర్తు తరపున విస్తృత ప్రచారం
నిర్మల్, ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ) నిర్మల్ మున్సిపల్ ఎన్నికల్లో 36.37.38వ వార్డు నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా గురువారం బీజేఎల్పీ నేత ఏ మహేశ్వర్ రెడ్డి విస్తృత ప్రచారం చేపట్టారు. చేస్తున్నాను మీ బిడ్డలు గా ఆదరించండి ఆశీర్వదించండి గెలిపించండి వార్డుల ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం తన మద్దతుదారులతో కలిసి విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు.
ఇంటింటికి వెళ్లి ఈ ఎన్నికల్లో కౌన్సిలర్ గా పూదరి ఉదయ శ్రీ38 వార్డు . నేరెళ్ల సాయి37 వార్డు. మెడిసిమ్మ శ్రీలత 36 వార్డు పోటీ చేస్తున్న వీరందరినీ కమలం పువ్వు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ప్రార్థించారు. వారిని గెలిపిస్తే ఏ ఏ పనులు చేపడుతానో వివరిస్తూ ఓటర్ల మద్దతు కోరారు. ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యేకు ఓటర్ల నుండి అపూర్వ స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ ప్రాంతం వాడిని మీ బిడ్డను మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలో నిలిచారు
వారికీ అండగా నిలవండి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించండి మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకుందామని అన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధ్యమని అన్నారు. కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటు సభ్యులు నగేష్ సహకారంతో అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను సాధించి పెద్ద ఎత్తున అభివృద్ధి చేపడుతానని అన్నారు. మీ అందరివాడిగా మీకు మాటేస్తున్న ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి మన ప్రాంత సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తాను పార్టీ నాయకత్వాన్ని నమ్మి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి కౌన్సిలర్ లు గా వారిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు. 4వ వార్డు బిజెపి అభ్యర్థి పీకే. నరసింహ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు. కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
