అక్కడ అంతకు మించి స్పీడు వద్దు..

అక్కడ అంతకు మించి స్పీడు వద్దు..

కడెం, ఆదిలాబాద్ జిల్లా : కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఖానాపూర్ డివిజన్ పరిధిలోని అటవీ మార్గం ద్వారా ప్రయాణించే అన్ని రకాల వాహనాలు/వాహనదారులు అభయారణ్యం టైగర్ రిజర్వ్ నిబంధనల ప్రకారం (30) కి.మీ. గరిష్ట వేగ పరిమితిని ఖచ్చితంగా పాటించాలని.. 30 కిలోమీటర్ మించి వాహనాలు నడపరాదని ఖానాపూర్ ఎఫ్ డి ఓ కె శివకుమార్ వాహనదారులకు కోరారు. ఈ వేగ నియంత్రణ పాటించకపోవడం వలన ప్రమాదాలు జరిగి ప్రజలు, వన్యప్రాణులు, పశువులు, గాయాల పాలవుతున్నాయని కొన్ని సందర్భాలలో, ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతుందన్నారు. అడవి దున్నలు, దుప్పులు, జింకలు, తదితర వన్యప్రాణులు రోడ్డు దాటే ప్రాంతాలలో, ప్రమాద సంభావ్యత ఉన్న ప్రాంతాలలో వేగ నియంత్రణ కొరకై బారికేడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

కావున, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఖానాపూర్ డివిజన్ పరిధిలోని అటవీ మార్గం ద్వారా ప్రయాణించే అన్ని రకాల వాహనాలు/వాహనదారులు (30) కి.మీ. గరిష్ట వేగ పరిమితిని మించకుండా ప్రయాణించ వలసినదిగా ఆయన కోరారు. కావున ఇట్టి విషయమై ప్రజలలో అవగాహన కల్పించుట కొరకై ఈ విషయాన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply