Social Media | బ్యాంకుకు మృతదేహంతో…

Social Media | బ్యాంకుకు మృతదేహంతో…
Social Media | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఒడిశాలోని కెందుఝర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. సోదరి అంత్యక్రియలకు డబ్బు లేక తీవ్ర ఇబ్బందులు పడిన ఓ వ్యక్తి, ఆమె మృతదేహాన్ని భుజాన మోసుకుంటూ బ్యాంకుకు వెళ్లడం అందరినీ కలచివేసింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో బ్యాంకు అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గును ముండా అనే మహిళ మరణించగా, ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు సోదరుడు జితు ముండా డబ్బు కోసం ప్రయత్నించాడు. సోదరి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.19,300ను విత్‌డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్లగా, ఖాతాలో నామినీ లేరని, ఖాతాదారు స్వయంగా రావాలని బ్యాంకు అధికారులు తెలిపారు.

దీంతో తీవ్ర ఆవేదనకు గురైన జితు ముండా, తన సోదరి మృతదేహాన్ని భుజాన మోసుకుంటూ సుమారు 2 కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు చేరుకున్నాడు. ఈ దృశ్యం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో ప్రజలు బ్యాంకు అధికారుల నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండించారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని, కుటుంబానికి డబ్బు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
