ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యం…

ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యం…

నాగర్కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిజినపల్లి, తిమ్మాజిపేట మండలాల సీఎం ఎఫ్ ఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మండలంలోని వివిధ గ్రామాలకు సంబందించిన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రశంసించారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తోందని, సమాజంలోని ప్రతి వర్గానికీ ఆర్థిక భద్రత కల్పించడం లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలు పేద కుటుంబాల్లో కూతుళ్ల పెళ్లిళ్ల కోసం ఆర్థిక సాయం అందించడం ద్వారా వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు.. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తుందన్నారు.

ముఖ్యంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, వైద్య చికిత్సల కోసం లేదా అత్యవసర సమయంలో ఆర్థిక సహాయం అవసరమైన సందర్భాల్లో సీఎం సహాయనిధి ద్వారా అందిస్తున్న సాయాన్ని వారు విశేషంగా కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ప్రతి పేద కుటుంబానికి అండగా నిలబడే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వారు వెల్లడించారు, సీఎం సహాయనిధి పథకం, కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాకుండా, సంక్షోభ సమయాల్లో ప్రజలకు ఆశాకిరణంగా ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులు తమకు అందించిన సాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రభుత్వానికి, ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. చివరిగా, ప్రజల సంక్షేమం కోసం మరింత సమర్థంగా పనిచేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అందరూ కలిసి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, బిజినేపల్లి మండల్ ప్రెసిడెంట్ మిద్దె రాములు, తిమ్మాజిపేట మండల్ ప్రెసిడెంట్ వివేక్ రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరామ్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లయ్య, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల ముఖ్య నాయకులు, ప్రభుత్వ అధికారులు, లబ్ధిదారులు, గ్రామస్తులు, తదితరులు, పాల్గొన్నారు..

Leave a Reply