తీవ్ర ఎండలతో వృద్ధురాలి మృతి

ధర్మసాగర్, ఆంధ్రప్రభ : ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల గ్రామానికి చెందిన గుర్రాల సుగుణ (90) తీవ్ర ఎండల ప్రభావంతో మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం గత రెండు రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురైన సుగుణ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ప్రస్తుతం మండలంలో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, వృద్ధులు మరియు చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Leave a Reply