సబ్ పోస్ట్ మాస్టర్ షకీల్ షేక్ సేవలు మరువలేనివి

సబ్ పోస్ట్ మాస్టర్ షకీల్ షేక్ సేవలు మరువలేనివి

– వీడ్కోలు సభలో ప్రశంసలు

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ:
జుక్కల్ పోస్టాఫీస్ సబ్ పోస్ట్ మాస్టర్ షకీల్ షేక్ సేవలు మరువలేనివని పలువురు ఖాతాదారులు, ప్రజలు, బీఓలు కొనియాడారు. గత మూడు సంవత్సరాలుగా జుక్కల్ పోస్టాఫీస్‌లో సేవలందించిన ఆయన మద్నూర్ మండల కేంద్రానికి బదిలీ కావడంతో సోమవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ పోస్ట్ మాస్టర్ షకీల్ షేక్‌ను శాలువా, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు.

వక్తలు మాట్లాడుతూ, ఆయన సమయపాలన పాటిస్తూ విధులకు న్యాయం చేస్తూ ఖాతాదారులకు, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉన్నారని తెలిపారు. పోస్టల్ శాఖ పథకాలైన సుకన్య సమృద్ధి యోజనతో పాటు ఇతర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
అలాగే కొత్తగా జుక్కల్ సబ్ పోస్ట్ మాస్టర్‌గా పిట్లం మండలం నుండి బదిలీపై వచ్చిన జి. లింగొండను ఆహ్వానిస్తూ శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో బీఓలు భీంరావు, శ్రీనివాస్, రాజేందర్, సమాద్, సచిన్, నితిన్, వీరేందర్, బాలాజీ రాథోడ్‌తో పాటు పోస్టాఫీస్ ఖాతాదారులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply