Operation-Back-Door: ఔను థన్ వంతరే Andhra Prabha Top Story
Operation-Back-Door: ఔను థన్ వంతరే Andhra Prabha Top Story
- ఆపరేషన్ బ్యాక్ డోర్ స్నెఫలిస్టు =
- హెల్త్ ఉద్యోగి.. వె్ల్థీ వేట
- క్యాఫ్ కొడితే,,
- బదిలీ రోగం మాయం
- బ్యాక్ డోర్ లో పోస్టింగ్
- నిబంధనలతో పని లేదు
- గుంటూరు జిల్లా డీఎంహెచ్ఓలో క్యాష్ అండ్ క్యారీ
ఉమ్మడి గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ:
అనగనగా ఓ ఉద్యోగి… అధికారులను మెప్పించడంలో, కార్యాలయ వ్యవహారాలు చక్కబెట్టడంలో ఘనాపాటిగా పేరున్న సీనియర్ అసిస్టెంట్. చాలా కాలంగా జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న అతనికి ఒక్క కోరిక మాత్రం మిగిలింది… ఏదోలా ప్రాంతీయ డైరెక్టర్ (ఆర్డీ) కార్యాలయంలో అడుగుపెట్టాలి! కానీ ఒక చిన్న సమస్య… ప్రభుత్వం బదిలీలపై ఆంక్షలు విధించింది. ఉద్యోగుల విభజన ప్రక్రియ కొనసాగుతోంది. నేరుగా బదిలీ అసాధ్యం.
ఇంతలో జూలై 31 వచ్చింది. ఆర్డీ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్ పదవీ విరమణ చేశారు. అంతే… అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న ఫైళ్లు ఒక్కసారిగా పరుగులు తీశాయి. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న సదరు ఉద్యోగిని “సరెండర్” చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ సరెండర్‌కు కొన్ని గంటల వ్యవధిలోనే ఆర్డీ కార్యాలయంలో పోస్టింగ్ కూడా ఖరారైంది. బదిలీలపై నిషేధం ఉన్న సమయంలో ఈ వేగం చూసి ఉద్యోగులు విస్తుపోతున్నారు.
Operation-Back-Door: సరెండర్ పేరుతో దొడ్డి దారి..!
సాధారణ బదిలీ సాధ్యం కాకపోవడంతో “సరెండర్” అనే మార్గాన్ని ఉపయోగించారా? అనే ప్రశ్నలు ఉద్యోగుల్లో వినిపిస్తున్నాయి. ఆర్డీ కార్యాలయంలో ఖాళీ ఏర్పడబోతోందన్న విషయం ముందుగానే తెలిసి ఉండటంతో, దానికి అనుగుణంగానే ఈ వ్యవహారం నడిచిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిటైర్మెంట్ రోజునే కొత్త పోస్టింగ్ సిద్ధంగా ఉండటం యాదృచ్ఛికమా? లేక ముందే పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందా? అనే చర్చ వైద్యారోగ్యశాఖలో హాట్‌టాపిక్‌గా మారింది.
Operation-Back-Door: నిబంధనలు పక్కన పెట్టారా?
ప్రభుత్వం సాధారణ బదిలీల గడువు ముగిసిన తర్వాత మళ్లీ బదిలీలు, డెప్యూటేషన్లపై ఆంక్షలు విధించింది. ముఖ్యంగా ఉద్యోగుల విభజన ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో కొత్త పోస్టింగ్‌లు, సరెండర్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సరెండర్‌కు ప్రభుత్వ ప్రత్యేక అనుమతి తీసుకున్నారా? పరిపాలనా అవసరం ఏమిటి? సాధారణ విధానాన్ని ఎందుకు అనుసరించలేదు? అనే ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానం లేదు.
Operation-Back-Door:ఉద్యోగుల్లో అసంతృప్తి
ఏళ్లుగా తమ బదిలీ దరఖాస్తులు, ప్రమోషన్ ఫైళ్లు, స్థానిక సమస్యలు పెండింగ్‌లో ఉన్నా స్పందన లేదని ఉద్యోగులు వాపోతున్నారు. కానీ కొందరి విషయంలో మాత్రం ఫైళ్లు గంటల్లో కదులుతున్నాయని ఆరోపిస్తున్నారు. “మా ఫైళ్లు నెలల తరబడి తిరుగుతుంటే… ఈ పోస్టింగ్ మాత్రం రిటైర్మెంట్ రోజునే ఎలా పూర్తయింది?” అని ప్రశ్నిస్తున్నారు.
Operation-Back-Door: విచారణకు డిమాండ్
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత ఫైల్ నోటింగ్‌లు, సరెండర్ ఉత్తర్వులు, పోస్టింగ్ ఆదేశాలు, ప్రభుత్వ అనుమతులను బహిర్గతం చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న బదిలీ నిబంధనలు అందరికీ సమానంగా వర్తిస్తున్నాయా? లేక కొందరికే మినహాయింపులు ఇస్తున్నారా? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాయి.
Operation-Back-Door:పోస్టింగ్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాం
ఈ వ్యవహారంపై ఆంధ్రప్రభ ప్రాంతీయ డైరెక్టర్ నాగరాజును ప్రశ్నించగా, రాష్ట్రంలో బదిలీలపై నిషేధం అమల్లో ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే, “సరెండర్ అయిన ఉద్యోగికి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉండటంతో ఆర్డీ కార్యాలయంలో ఇచ్చాం” అని సమాధానమిచ్చారు. “సరెండర్ ఎందుకు చేశారు?” అనే ప్రశ్నకు మాత్రం “అది డీఎంహెచ్‌వో కార్యాలయంలో కనుక్కోండి” అంటూ స్పందించారు.
ప్రభుత్వం బదిలీలపై ఆంక్షలు అమలు చేస్తున్న సమయంలో చోటుచేసుకున్న ఈ “సరెండర్–పోస్టింగ్” వ్యవహారం ఇప్పుడు గుంటూరు వైద్యారోగ్యశాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇది నిజంగా పరిపాలనా అవసరమా? లేక నిబంధనలను పక్కన పెట్టి దొడ్డి దారిన జరిపిన పోస్టింగ్నా? అన్నది తేలాల్సి ఉంది
