రెండేళ్లలో ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించాం…
- అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ గుర్తింపు
- టిడిపి రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్
- బ్రహ్మానందరెడ్డి నగర్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
- ఇంటింటికి తెలుగుదేశం–2 ఏళ్ల నమ్మకం’ కార్యక్రమం
- ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై అవగాహన
- ప్రతి కుటుంబానికి ప్రభుత్వ విజయాలను చేరవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు
(విజయవాడ ఆంధ్రప్రభ) : “కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం రెండేళ్లలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించిందని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం” అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 6వ డివిజన్ బ్రహ్మానందరెడ్డి నగర్‌లో డివిజన్ అధ్యక్షుడు పడాల గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో గన్నే ప్రసాద్ పాల్గొని పార్టీ నాయకులతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.

అనంతరం “ఇంటింటికి తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి–సంక్షేమం” కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రభుత్వ పనితీరుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గన్నే ప్రసాద్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రజల్లో మరింత విస్తృతంగా చైతన్యం కల్పించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
