పల్నాడులో వరుస చోరీల ముఠా గుట్టురట్టు..

పల్నాడులో వరుస చోరీల ముఠా గుట్టురట్టు..

రూ. 8 లక్షల ఆభరణాల స్వాధీనం!

నరసరావుపేట, ఆంధ్రప్రభ : పల్నాడు ప్రాంతంలో వరుస దొంగతనాలతో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న ముగ్గురు సభ్యుల అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు ఎట్టకేలకు ఆటకట్టించారు. దాచేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గురజాల డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐ రాజేశ్‌తో కలిసి వివరాలను వెల్లడించారు.

జైలులో ఒకరికొకరు పరిచయమై, బయటకు వచ్చిన తర్వాత ముఠాగా ఏర్పడి వీరు ఈ వరుస చోరీలకు తెగబడ్డారని డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి సుమారు రూ. 8 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని, ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశామని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply