Guest|పేదవాని ఇంట రేవంత్ కు నేడు సన్న బియ్యం ఆతిధ్యం

పినపాక /బూర్గంపాడు, ఏప్రిల్ 6, (ఆంధ్రప్రభ న్యూస్): శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి కి పట్టు వస్త్రాలు సమర్పించడానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా బూర్గంపాడు మండలంలోని సారపాక గ్రామంలోని బూరం శ్రీనివాస్, గృహంలో సన్న బియ్యంతో ఉండిన సాధారణమైన భోజనాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించునున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆ ఇంటికి చేరుకొని వంటలను పరిశీలించారు.

భద్రాచలం సీతారామచంద్రస్వామి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత బూర్గంపాడు మండలంలోని సారపాక గ్రామంలో బూరం శ్రీనివాస్ గృహంలో సీఎం రేవంత్ రెడ్డి సాధారణమైన భోజనాన్ని ఆతిధ్యం స్వీక రించినన్నారు. ఈ సాధారణ భోజనంలో సన్న బియ్యం అన్నంతో పాటు పప్పు, గోంగూర, సాంబారు, పెరుగు, పులిహోర, పాయసం, బెల్లం పానకం, స్వీకరించినన్నారు.

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి స్వాగతం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ నందు శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం ఆలయంలో జరుగు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.

రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి స్వాగతం

: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ నందు శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం ఆలయంలో జరుగు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.

Leave a Reply