‘Cocktail 2’ trailer | బాలీవుడ్‌లో కొత్త క్రేజ్…

‘Cocktail 2’ trailer | బాలీవుడ్‌లో కొత్త క్రేజ్..

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌ : నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న నటించిన బాలీవుడ్ చిత్రం ‘కాక్‌టెయిల్ 2’ ట్రైలర్ విడుదలైంది. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌తో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. రొమాన్స్, కన్ఫ్యూజన్, ఫన్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది.

2012లో వచ్చిన ‘కాక్‌టెయిల్’ సినిమాకు స్పిరిచువల్ సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. హోమీ అదజానియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షాహిద్–కృతి కెమిస్ట్రీతో పాటు రష్మిక పాత్ర కూడా ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. ముగ్గురు పాత్రల మధ్య వచ్చే ఎమోషన్స్, గందరగోళ పరిస్థితులు కథలో కీలకం కానున్నట్లు ట్రైలర్‌ ద్వారా తెలుస్తోంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సినిమా కథపై వస్తున్న ఊహాగానాలపైనా చిత్రబృందం స్పందించింది. కృతి సనన్, రష్మిక పాత్రలపై సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్‌కు దర్శకుడు హోమీ అదజానియా క్లారిటీ ఇచ్చినట్లు రిపోర్టులు పేర్కొన్నాయి.

‘కాక్‌టెయిల్ 2’ జూన్ 19, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ బయటకు రావడంతో రష్మిక అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. బాలీవుడ్‌లో రష్మికకు మరో క్రేజీ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా నిలుస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Leave a Reply