ఘనంగా నాగుల పంచమి వేడుకలు
దండెపల్లి, ఆంధ్రప్రభ : నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని దండెపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో నాగదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెల్లవారుజాము నుంచే మహిళలు, భక్తులు ఆలయాలకు చేరుకుని పుట్టలో పాలు పోసి, పసుపు, కుంకుమ, పూలతో నాగదేవతలను పూజించారు.
నాగుపాము ప్రతిమలకు పూజలు చేసి తమ కుటుంబాలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని భక్తులు ప్రార్థించారు. పలు ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా నాగుల పంచమి వేడుకలను జరుపుకున్నారు. ఆలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు, సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారు.
భక్తులు భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
