కొండగట్టు అంజన్నను దర్శించుకున్న కరీంనగర్ కలెక్టర్
మల్యాల, ఆంధ్రప్రభ : తెలంగాణాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్‌కు దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ స్థానాచారి కపిందర్ ,ఉప ప్రధాన అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించి, స్వామివారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ ఉపాధ్యాయుల చంద్రశేఖర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ చెక్కిళ్ళ అశోక్, ఏఎస్ఐ రమణారెడ్డి పాల్గొన్నారు.
