Tekumatla | క్రీడా సామాగ్రి అందజేత

Tekumatla | టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వేలంపల్లి గ్రామానికి చెందిన కూర అజయ్ సింహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆ గ్రామంలోని యువతకు క్రీడా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలనే ఉద్దేశంతో తన పుట్టినరోజు సందర్భంగా వారికి వాలీబాల్ క్రీడా సామాగ్రి అందజేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ఆ యువకులు అజయ్ సింహరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలిపారు.