గ్రామపంచాయతీ అభివృద్ధికి శ్రీకారం

వెల్దండ, ఆంధ్రప్రభ ; ప్రజా ప్రాణాలిక లో భాగంగా వెల్దండ మండల సమీపంలోని పోతేపల్లి గ్రామపంచాయతీ భవనానికి సోమవారం నూతనంగా రంగులకు వేయడం జరిగిందని సర్పంచ్ కొండల్ యాదవ్ అన్నారు. అనంతరం అపరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామ ప్రజల సహాయ సహకారాలతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పరుస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.