ఘనంగా అంగన్వాడి పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే…

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలంలోని పెద్దమ్మ కాడి తండా గ్రామపంచాయతీ పరిధిలో అంగన్వాడి పాఠశాలలో శనివారం గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ భూక్య రమేష్ నాయక్, హాజరై ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని అందంగా అలంకరించారు. అంగన్వాడి పాఠశాల విద్యార్థులు గ్రాడ్యుయేషన్ సందర్భంగా గౌన్లు ధరించిన చిన్నారులను చూసి అభినందించి సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పాఠశాల మాట్లాడుతూ, చిన్నారులకు చిన్న తరగతుల నుండి గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను, నృత్యాలను ప్రశంసించారు. చిన్నారులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు, అంగన్వాడి పోషకాహారాలు అందజేసి విద్యార్థులకు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతి కార్యదర్శి మమత,ఉప సర్పంచ్ గణపతి,వీడిసి అధ్యక్షుడు భుక్య ప్రకాష్,అంగన్వాడి టీచర్ ప్రత్యూష, అంగన్వాడి ఆయాలు భూక్య లక్ష్మి, భూక్య భూలీ, రాంచందర్, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు…

Leave a Reply