Charan – Sukumar | ప్రాజెక్ట్ పట్టాలెక్కేది ఎప్పుడు…?

Charan – Sukumar | ప్రాజెక్ట్ పట్టాలెక్కేది ఎప్పుడు…?
Charan – Sukumar | చరణ్ – సుకుమార్ కాంబోపై భారీ అంచనాలు
పుష్ప 2 తర్వాత సుకుమార్ ఫోకస్ ఇదే
రూరల్ లేదా అర్బన్..? జోనర్‌పై చర్చ
ఆర్య, పుష్ప స్పూర్తితో కొత్త క్యారెక్టర్
చరణ్ గ్రీన్ సిగ్నల్ వెనుక కారణం
సెట్స్ పైకి ఎప్పుడు..? ఫ్యాన్స్ ఎదురు చూపులు
Charan – Sukumar | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. ఈ ఇద్దరి కాంబోలో రూపొందిన రంగస్థలం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆతర్వాత మళ్లీ కలిసి మరో సినిమా చేయబోతున్నారని ఎప్పుడో ప్రకటించారు కానీ.. ఇంత వరకు పట్టాలెక్కలేదు. అయితే.. ఈ మూవీలో చరణ్ క్యారెక్టర్ ని రెండు సినిమాల (Movies) స్పూర్తితో రాస్తున్నారని వార్తలు వస్తుండడంతో మరింత క్రేజ్ ఏర్పడింది. ఇంతకీ.. సుకుమార్ ఏ రెండు సినిమాల స్తూర్తితో కథ రాస్తున్నారు. ఈ మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?

Charan – Sukumar | పుష్ప 2 తర్వాత..
చరణ్ కోసం సుకుమార్.. పుష్ప 2 తర్వాత నుంచి కథ పై కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఈసారి కూడా అదిరింది అనేలా ఉండే కథను (Story) రెడీ చేశారట ఈ క్రియేటీవ్ జీనియస్. అయితే.. చరణ్ తో రంగస్థలం అనే రూరల్ డ్రామా తీసారు కదా.. ఈసారి ఎలాంటి జోనర్ లో సినిమా చేస్తారు..? రూరలా..? అర్బనా..? అనేది ఆసక్తిగా మారింది. ఈసారి అర్బన్ అయితే బాగుంటుందేమో అని మెగా అభిమానులు అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే.. సుకుమార్ ప్లాన్ మరోలా ఉందట. కథ కన్నా.. క్యారెక్టరైజేషన్ పైనే దృఫ్టి పెట్టాడని వార్తలు వస్తుండడం విశేషం.

Charan – Sukumar | ఆ రెండు క్యారెక్టర్స్ స్పూర్తితో..
మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. సుకుమార్ తీసిన రెండు సినిమాల్లోని హీరో క్యారెక్టరైజేషన్స్ స్పూర్తితో ఈ సినిమా కథలో హీరో క్యారెక్టర్ ని డిజైన్ చేశారట. ఇంతకీ.. ఆ రెండు సినిమాలు ఏంటంటే.. ఒకటి ఆర్య, రెండోది పుష్ప. ఈ రెండు సినిమాల్లో హీరో క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పైగా ఆ క్యారెక్టరైజేషనే.. సినిమా జనాలకు బాగా కనెక్ట్ కావడానికి కారణం. ఇటీవల చరణ్ (Charan) కి సుకుమార్ ఫుల్ స్టోరీ వినిపించారట. కథ విని చరణ్ వెంటనే ఓకే చెప్పారట. సుకుమార్ డిజైన్ చేసినటువంటి క్యారెక్టర్ చరణ్ ఇప్పటి వరకు చేయలేదట. అది నచ్చే చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. పెద్ది రిలీజ్ తర్వాత.. ఈ సినిమాని స్టార్ట్ చేయనున్నారని సమాచారం. మరి.. చరణ్, సుకుమార్ కలిసి రంగస్థలం మించేలా.. మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.

