- బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: కర్నూలు నగరంలోని నిర్మల్‌నగర్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన భరత్‌కుమార్ (21) అనే బీటెక్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన జరిగింది.
భరత్ స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. సెమిస్టర్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో మానసిక ఆందోళనకు గురై, పరీక్షల భయంతోనే ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

