219 ఆవాసాలలో ప్రధానమంత్రి ప్రత్యేక ప్రోగ్రాం ఏర్పాటు..

219 ఆవాసాలలో ప్రధానమంత్రి ప్రత్యేక ప్రోగ్రాం ఏర్పాటు..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని నంద్యాల పల్నాడు జిల్లాలను సంబంధించి గిరిజన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జయప్రదం ప్రత్యేకంగా ఓడల టీచర్లను ఏర్పాటు చేసిందని ఈ పథకాన్ని జయప్రదం చేయాలని శ్రీశైలం ఐటీడీఏ పథకం నిర్వహణ అధికారి పి వి కే నాయుడు ఆదివారం తెలిపారు. వివరాల మేరకు గిరిజన మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారి ఆదేశాల మేరకు మే నెల 18 వ తేది నుండి 25 వ తేది వరకు ఐ.టి.డి.ఎ, శ్రీశైలం ఆధ్వర్యం లోని మూడు జిల్లాలు నంద్యాల, మార్కాపురం, పల్నాడు జిల్లాల లోని పీఎం జనుమాన్ అంటే (ప్రధాన మంత్రి జంజాటి ఆదివాసీ న్యాయ మహా అభియాన్), డజగు అంటే (Dharti అబ జంజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ ) అనే ప్రోగ్రామ్ను గిరిజన ప్రాంతాల ఆవాసాలలో ‘జన్ భాగిదారి – సబ్ సే దూర్, సబ్ సే పెహలే’ అనే కార్యక్రమము నిర్వహింపబడుతుందని పి. వి. కే. నాయుడు తెలిపారు.
నంద్యాల జిల్లాలోని 48 పి. వి. టి. జి ఆవాసాలు, మార్కాపురం జిల్లాలోని 89 ఆవాసాలు, పల్నాడు జిల్లాలోని 82 ఆవాసాలలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. నంద్యాల జిల్లాకు ఎన్ ఆర్ ఈ జి ఎస్ పి ఎం అధికారి కేజీ నాయక్, మార్కాపురం జిల్లాకు ఏ పి ఓ అధికారి ఏ .సురేష్ కుమార్, పల్నాడు జిల్లాకు వెలుగు ఏ పిడి పీక్లా నాయక్ లను జిల్లా నోడల్ ఆఫీసర్ గా నియమించడమైనదన్నారు. నంద్యాల, మార్కాపురం, పల్నాడు జిల్లాల గిరిజన సంక్షేమ ఆధికారులు ఆయా జిల్లాలకు జిల్లా సమన్వయ అధికారులు గా వ్యవహరిస్తారన్నారు. మూడు జిల్లాల మండల అభివృద్ధి అధికారులు మండల నోడల్ ఆఫీసర్లుగా ఉంటారు. అన్నీ ఆవాసాలకు గ్రామ స్థాయి అధికారులను నియమించడమైనదన్నారు.
మండల అభివృద్ధి అధికారుల పర్యవేక్షణలో వారు నియమించిన గ్రామ స్థాయీ అధికారుల ద్వారా పైన చెప్పిన అన్నీ గ్రామాలలో ఈ కార్యక్రమము నిర్వహింపబడుతుందన్నారు.. ఈ కార్యక్రమము లో భాగంగా 18 వ తేది మూడు జిల్లాల కలెక్టర్ ఆఫీసులలో జిల్లా కలెక్టర్ల చేత ఈ కార్యక్రమము ప్రారంభోత్సవము కావింపబడుతుందన్నారు. 19 వ తేది ఆయా గ్రామాలలో గ్రామ సభ నిర్వహణ, మొక్కలు నాటే కార్యక్రమము చేయబడుతుందన్నారు. 20 వ తేది ట్రాన్సక్ట్ వాక్ జరుపుట జరుగుతుందన్నారు. జన్ సున్వాయ్ కార్యక్రమము చేపడుతా మన్నారు.
19 వ తేది నుండి 25 వ తేది వరకు ఎన్ టైటిల్మెంట్ డ్రైవ్, సాటు రేషన్ క్యాంపు లు, హెల్త్ క్యాంపు లు నిర్వహింపబడుతాయన్నారు. 21 వ తేది నుండి 23 వ తేది వరకు జన్ సున్వాయ్ కార్యక్రమము క్రింద అర్జీల స్వీకరణ జరుగుతుందన్నారు. 24 వ తేదీన అర్జీల సమీకరణ మరియు ఐ టీ డి ఏ పి ఓ మరియు కలెక్టర్లకు నివేదన జరుగుతుందన్నారు. 25 వ తేది జిల్లా కలెక్టర్ల ద్వారా జిల్లా స్థాయీ, మండల స్థాయీ, గ్రామ స్థాయీ అధికారుల సమక్షంలో తదుపరి కార్యక్రమం పై చర్చ, ముగింపు కార్యక్రమంతో ఈ కార్యక్రమము ముగుస్తుందన్నారు..
ఈ కార్యక్రమంపై ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి వారు జిల్లా నోడల్ ఆఫీసర్లు,జిల్లా గిరిజన సంక్షేమ అధికారులు, మండల నోడల్ ఆఫీసర్లు, సంబంధిత ఇతర సిబ్బంది తో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశము చేయడమైనదన్నారు. కావునా చెంచు గూడేలలోని గిరిజనులందరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసినదిగా కోరారు.
