అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తాం

  • డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళీ నాయక్

కేసముద్రం, ఆంధ్రప్రభ : పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని డీసీసీ అధ్యక్షురాలు భూక్యా ఉమా మురళీ నాయక్ అన్నారు. శుక్రవారం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు దన్నసరిలో కొండేటి రమణజమ్మ–కామేశ్వరరావు నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ భానోత్ సునీత వెంకన్నతో కలిసి రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు. అనంతరం గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఉమా మురళీ నాయక్, గంట సంజీవరెడ్డి, భానోత్ సునీత వెంకన్న మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అర్హత కలిగిన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్, జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ సభ్యుడు రావుల మురళి, బండారు దయాకర్, మాజీ ఉపసర్పంచ్ భానోత్ చిన్న వెంకన్న, దన్నసారి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు కొండా సురేష్, కౌన్సిలర్లు ధారావత్ కిషోర్, తరాల వీరేష్ యాదవ్, మార్కెట్ డైరెక్టర్ అయూబ్ ఖాన్, యాదగిరి, కనుకుల రాంబాబు, భానోత్ భద్రు, స్థానికులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.