Gold Price | మళ్లీ తగ్గిన పసిడి ధర

Gold Price | మళ్లీ తగ్గిన పసిడి ధర
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : పసిడి ప్రియులకు ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్‌లో ధరలు తగ్గినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మార్పులు, అలాగే గ్లోబల్ భౌగోళిక ఉద్రిక్తతలు కొంత తగ్గడం వంటి అంశాలు ధరలపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 1న హైదరాబాద్ మార్కెట్లో 18, 22, 24 క్యారెట్ల బంగారం ధరలు కూడా గత సెషన్‌తో పోలిస్తే తగ్గిన ధోరణి కనిపించింది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు సైతం పసిడి రేట్లు తగ్గాయి. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 750 మేర తగ్గింది. దీంతో తులం రేటు రూ.1,43,200 వద్దకు దిగొచ్చింది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.820 మేర పడిపోయింది. దీంతో తులం రేటు రూ.1,56,220 వద్దకు దిగివచ్చింది. 21 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 610 మేర తగ్గింది. ప్రస్తుతం దాని ధర 1,17,170గా ఉంది.
బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నా వెండి రేటు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. గత 3 సెషన్లుగా ఎలాంటి మార్పు లేదు. ఈ రోజు హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.2,80,000 మార్క్ వద్ద స్థిరంగా ట్రేడవుతోంది.
CLICK HERE TO READ IPL Final 2026 | Stock Market | సెన్సెక్స్, నిఫ్టీకి గ్లోబల్ మార్కెట్ల మద్దతు
