Stock Market | సెన్సెక్స్, నిఫ్టీకి గ్లోబల్ మార్కెట్ల మద్దతు
Stock Market | సెన్సెక్స్, నిఫ్టీకి గ్లోబల్ మార్కెట్ల మద్దతు
Stock Market | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, అమెరికా మార్కెట్లలో నమోదైన లాభాలు భారత మార్కెట్లకు ఊతమిస్తున్నాయి. దీంతో ప్రారంభ ట్రేడింగ్‌లోనే కీలక సూచీలు పచ్చబాట పట్టాయి.
ఉదయం ట్రేడింగ్‌లో నిఫ్టీ 41 పాయింట్లు పెరిగి 23,585 వద్ద కొనసాగుతుండగా, సెన్సెక్స్ 162 పాయింట్లు పుంజుకుని 74,937 వద్ద ట్రేడవుతోంది. కొనుగోళ్ల ఆసక్తి పెరగడంతో మార్కెట్లు సానుకూల ధోరణి కనబరుస్తున్నాయి. ఐటీ, ఆటో, ఫైనాన్షియల్ రంగాల షేర్లలో కొనుగోళ్లు నమోదవుతున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
అమెరికా డాలర్ ఇండెక్స్ 99.05 వద్ద కొనసాగుతుండగా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 92.9 డాలర్లుగా నమోదైంది. మరోవైపు అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.46 శాతానికి చేరాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో అమెరికా మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.22 శాతం, నాస్‌డాక్ 0.21 శాతం మేర పెరగడం దేశీయ మార్కెట్ల సెంటిమెంట్‌కు మద్దతుగా నిలిచింది.
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ముడి చమురు ధరల కదలికలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం తదుపరి ట్రేడింగ్ దిశను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
