డిప్యూటీ సీఎంకు మంత్రి నిమ్మల ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఓ ఆత్మీయ కలయిక చోటుచేసుకుంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Rama Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ను మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమార్తె వివాహానికి హాజరు కావాలంటూ పవన్ ను స్వయంగా ఆహ్వానించారు. మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు (Deputy CM Camp Office) కార్యాలయంలో పవన్ కల్యాణ్ తో మంత్రి నిమ్మల సతీసమేతంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా… ఈనెల 24వ తేదీన పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా పాలకొల్లులో జరగనున్న తన కుమార్తె శ్రీజ వివాహ వేడుకకు రావాలని కోరుతూ పవన్ కల్యాణ్ కు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ భేటీ ఎంతో ఆత్మీయంగా సాగింది.
ఈ విషయాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Rama Naidu) సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పవన్ కల్యాణ్ ను తన కుమార్తె పెళ్లికి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను కూడా ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.
