మియాజాకి రకం మామిడి పండ్లు సాగు చేసిన మాజీ సర్పంచ్..
ఇచ్చోడ, ఆంధ్రప్రభ : ఇచ్చోడ మండలంలోని ముక్కరాకే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గాడిగే మీనాక్షి తన పంట చేనులో కేసీఆర్ కేటీఆర్ జన్మదినం సందర్బంగా 4 ఏళ్ళ క్రితం ముఖరా కే గ్రామంలో 500 మామిడి మొక్కలు నాటారు. దానిలో 5 మొక్కలు మియా జాకి మామిడి మొక్కలు నాటారు. మొత్తం ఆర్గానిక్ గా పండించారు. వేసవి కాలం వచ్చిందంటే చాలు రోడ్ల వెంట ఎక్కడ చూసినా నోరూరించే మామిడి పండ్లు దర్శనమిస్తుంటాయి. రసాలు, బంగినపల్లి, తోతాపురి, నీలం లాంటి ఎన్నో రకాలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.
సాధారణంగా రకాన్ని బట్టి కిలో మామిడి రేటు రూ.100 నుంచి రూ.200 వరకు ఉంటుంది. మన దగ్గర సాగు చేసే దాదాపు అన్ని రకాల మామిడి ధరలు రూ.వందల్లోనే ఉంటాయి. అయితే జపాన్‌కు చెందిన ‘మియాజాకి’ పేరుతో సాగయ్యే ఓ మామిడి రకం మాత్రం కిలోకు రూ.2.5 లక్షలకు పైగా పలుకుతోంది. జపాన్‌లో సాగయ్యే ఈ రకం మామిడిని ఇప్పుడు ముఖరాకే గ్రామానికి చెందిన గాడ్గే మీనాక్షి ఈ మియాజాకి రకం మామిడి పండ్లను సాగు చేశారు.
ఈ రకం మామిడి శీతల ప్రాంతంలోనే పెరుగుతుందని, ఓసారి ప్రయత్నించి చూద్దామని నాలుగేళ్ల క్రితం కేరళ నుంచి మొక్కలను తెప్పించి నాటారు. 5 మియా జాకి మొక్కలు మాత్రం ఇక్కడి పరిస్థితులను తట్టుకుని పెరిగాయి. నాలుగేళ్ల కాలంలోనే తొలి కాత కాశాయి. ఆయుర్వేద గుణాలున్న ఈ రకం మామిడి ఈ ప్రాంతంలో సాగవడం అరుదేనని,ఇవి కిలో ధర రూ.2.5 లక్షలకు పైగా పలుకుతుందని, జపాన్‌కు చెందిన మియాజాకి నగరం పేరుతో సాగయ్యే ఈ మామిడి రకం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది గాడ్గే మీనాక్షి తెలిపారు.
