ఘనంగా బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు

కేక్ కట్ చేసి సంబరాలు..

పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నాయకుల వెల్లడి

కుంటాల, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని ఓలా గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు పసుల నవీన్, సర్పంచ్ కట్ట రవి ఆధ్వర్యంలో కేంద్ర హోం సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ, సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన బండి సంజయ్ కుమార్ అంకితభావం, నిబద్ధత, నిరంతర పోరాట పటిమతో జాతీయ స్థాయిలో కీలక నాయకుడిగా ఎదిగి కేంద్ర హోం సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

బండి సంజయ్ ఆశయాలు, సిద్ధాంతాలు, ప్రజాసేవా తత్వాన్ని ఆదర్శంగా తీసుకుని పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ముందుంటామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరవేసేందుకు నిరంతరం శ్రమిస్తామని వెల్లడించారు.

జన్మదిన వేడుకల్లో భాగంగా నాయకులు కేక్ కట్ చేసి కార్యకర్తలతో ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా మోర్చా అధ్యక్షుడు సాదు ప్రభాకర్, తాటి శివ, నరేష్, గోవర్ధన్, సూర్యవంశం సాయి, గౌస్ తదితరులు పాల్గొన్నారు.