నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి..

  • మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సిహెచ్ భవాని

కడెం, ఆంధ్రప్రభ : ఇటీవల రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో జరిగిన బహుళ హత్యల ఘటనపై మహిళా కాంగ్రెస్ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు సిహెచ్ భవాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిపై చట్టం ప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆదివారం కడెం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ, ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి బెయిల్‌పై విడుదలైన అనంతరం మైనర్ బాలిక, ఆమె తల్లి, అమ్మమ్మతో పాటు తన భార్య, పిల్లలను హతమార్చడం అత్యంత దారుణమైన ఘటన అని అన్నారు.

ఇలాంటి నేరాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా వేగవంతమైన, కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని సిహెచ్ భవాని ప్రార్థించారు.