హనుమంతరావుకు ఎమ్మెల్యే ఘన నివాళి
హనుమంతరావుకు ఎమ్మెల్యే ఘన నివాళి
కోడూరు మండలం బడేవారిపాలెంలో విషాదం
మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
కోడూరు, ఆంధ్రప్రభ : జనసేన నేత, ఎరువుల వ్యాపారి బడే హనుమంతరావు (54) ఆకస్మిక మృతితో కోడూరు మండలం బడేవారిపాలెంలో విషాదం నెలకొంది. గత రాత్రి తీవ్రమైన అస్వస్థతకు గురైన ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తమకు సన్నిహితుడైన హనుమంతరావు మృతి వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ శుక్రవారం ఉదయం బడేవారిపాలెం చేరుకొని ఆయన భౌతికకాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
హనుమంతరావు మృతి పట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై చివరి వీడ్కోలు పలికారు.
