ఇక‌పై తాగి న‌డిపే జ‌రిగేదిదే… !!

  • ధర్మపురి సీఐ

ధర్మపురి / ఆంధ్రప్రభ : మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదని ధర్మపురి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాంనర్సింహారెడ్డి హెచ్చరించారు. శనివారం రాయపట్నం చెక్‌పోస్ట్ వద్ద ఆయన ఆధ్వర్యంలో, సబ్‌ఇన్‌స్పెక్టర్ ఉదయ్‌కుమార్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కూడా చేపట్టారు.

సీఐ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు. వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండాలని, హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply