Adilabad | కోడ్ కూసింది.. ఫ్లెక్సీల తొలగింపు

Adilabad | కోడ్ కూసింది.. ఫ్లెక్సీల తొలగింపు

Adilabad | ఉట్నూర్, ఆంధ్రప్రభ : పంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో ఎన్నికల కోడ్(Election Code) అమల్లోకి వ‌చ్చింది. దీంతో ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ ఈవో శంకర్(Evo Shankar) పంచాయతీ ఉద్యోగుల కార్మికులతో రాజకీయ పార్టీ నాయకులు ప్రధాన చౌర‌స్తాల‌లో ఉన్న రాజకీయ పార్టీ నాయకుల ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల(Flexi)ను కార్మికులతో తొలగించారు.

వాటిని ట్రాక్టర్ ద్వారా గ్రామ పంచాయతీకి తరలించారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న నేప‌థ్యంలో ఇక‌పై ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయ‌వ‌ద్ద‌ని, ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమ‌ని ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ ఈవో శంకర్ తెలిపారు.

Leave a Reply