ఉచిత వైద్య సేవల శిబిరం..

ఉచిత వైద్య సేవల శిబిరం..
200 మందికి పరీక్షలు నిర్వహణ..
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : తణుకు పట్టణంలోని ఆరోగ్య మల్టీస్పెషాలిటీ హాస్పిటల్లో ఏషియన్ వాస్క్యులర్ హైదరాబాద్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరంలో సుమారు 200 మందికి పైగా రోగులకు స్కానింగ్ పరీక్షలు, డాక్టర్ కన్సల్టేషన్ సేవలు ఉచితంగా అందించారు. ఒక్కొక్క రోగికి సుమారు రూ.5 వేల విలువైన పరీక్షలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
కాళ్ల వాపులు, తిమ్మిర్లు, పుండ్లు, నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స సూచనలు అందించారు.
ఆరోగ్య మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ మేనేజర్ అమర్ మాట్లాడుతూ, పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సుమారు 200 మందికి స్కానింగ్, కన్సల్టేషన్ సేవలు పూర్తిగా ఉచితంగా అందించామని చెప్పారు. ఇలాంటి ఆరోగ్య శిబిరాలను రెగ్యులర్గా నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
తణుకు పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను తక్కువ ఖర్చుతో అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
హాస్పిటల్లో పల్మనాలజీ, యూరాలజీ, జనరల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, జనరల్ ఫిజీషియన్, న్యూరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 24×7 అత్యవసర వైద్య సేవలు కూడా అందిస్తున్నట్లు ఆయన వివరించారు.
