ఎండల ముప్పుపై హెచ్చరిక..

ఎండల ముప్పుపై హెచ్చరిక..

ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న సూచన..

గన్నవరం, ఆంధ్రప్రభ : మండుతున్న ఎండల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు.

గన్నవరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఆయన తెలిపారు. మరో వారం రోజులపాటు ఎండల తీవ్రత కొనసాగడంతో పాటు వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినట్లు చెప్పారు.

ఈ పరిస్థితుల్లో ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం లేకుండా బయటకు రావొద్దని ఆయన పేర్కొన్నారు.

అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే తలపై టోపీ ధరించడం, గొడుగు ఉపయోగించడం, తాగునీరు వెంట తీసుకెళ్లడం అవసరమని సూచించారు.

తలనొప్పి, వాంతులు, నీరసం, తల తిరగడం వంటి వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సేవలు పొందాలని ఆయన సూచించారు.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మధ్యాహ్న సమయంలో ఎండలో తిరగకుండా నీడలోనే ఉండాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు.

Leave a Reply