NIA అదుపులో మరో నలుగురు !!

NIA అదుపులో మరో నలుగురు !!
ఆంధ్రప్రభ : ఢిల్లీ ఎర్రకోట వద్ద ఈనెల 10న జరిగిన పేలుడు కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి జమ్మూ–కాశ్మీర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో దర్యాప్తు చేస్తుంది. తాజాగా ఈ కేసులో ఈ వైట్-కాలర్ టెర్రర్ మాడ్యూల్‌కి సంబంధించి మరో నలుగురు కీలక నిందితులను అదుపులోకి తీసుకుంది NIA. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.
శ్రీనగర్‌లో ప్రత్యేక ఆపరేషన్ సందర్భంగా పట్టుబడ్డ నిందితుల్లో పుల్వామాకు చెందిన డా. ముజమ్మిల్ షకీల్ గనై, అనంతనాగ్‌కు చెందిన డా. అదీల్ అహ్మద్ రథేర్, లక్నోకు చెందిన డా. షహీన్ సయీద్, షోపియాన్‌కు చెందిన ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ వాగే గా గుర్తించారు.
పేలుడు ప్రణాళిక, నిధుల సమీకరణ, దాడికి అవసరమైన లాజిస్టిక్స్‌ను సులభతరం చేయడంలో వీరు కీలక పాత్ర పోషించినట్లు NIA తెలిపింది.
ఇటీవల GMC అనంతనాగ్‌లో డా.అదీల్‌కు కేటాయించిన లాకర్‌లో AK-47 తుపాకీ వెలుగులోకి రావడం సంచలనమైంది. దీనితో కేంద్ర దర్యాప్తు సంస్థ జమ్మూ–కాశ్మీర్‌లోని పలువు రు ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టింది.
ఇదే కేసులో, పేలుడుకు ఉపయోగించిన వాహనం యజమాని అమీర్ రషీద్ అలీ, సాంకేతిక సహాయం అందించిన జాసిర్ బిలాల్ వాణీ అలియాస్ డానిష్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం మొత్తం ఆరుగురు నిందితులను విచారిస్తున్న NIA, నిధుల మార్గాలు, ఆన్‌లైన్ రాడికలైజేషన్ నెట్‌వర్క్‌లు, సరిహద్దు సమన్వయంపై దర్యాప్తు కేంద్రీకరించింది.
డిజిటల్, ఆర్థిక ఆధారాల పరిశీలన పూర్తయిన తర్వాత మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.
