Former MLC | కవిత కొత్త పార్టీ పేరు..
Former MLC | కవిత కొత్త పార్టీ పేరు..
Former MLC | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మాజీ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పేరు టిఆర్ఎస్ కాదు.. టీఆర్ఎస్ఏ. నిన్న హైదరాబాద్ లో కవిత తన పార్టీ పేరు (టిఆర్ఎస్) తెలంగాణ రాష్ట్ర సేన అని ప్రకటించిన విషయం విధితమే. అయితే కవిత పార్టీ పేరు టిఆర్ఎస్ కాదు టిఆర్ఎస్ఏ. కవిత పార్టీ పూర్తి పేరు తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కవిత తన పార్టీ పేరు టిఆర్ఎస్ అని చెప్పడం పై సోషల్ మీడియా పలువురు తప్పు బడుతున్నారు. పార్టీ పేరునే తప్పుగా చెప్పిన కవిత ప్రజలకు నిస్వార్థంగా సేవలు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
