గుండాలలో నీతి ఆయోగ్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

గుండాల/ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ ; గుండాల మండల కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సారధ్యంలో నిర్వహిస్తున్న మండల అభివృద్ధి పనులను నీతి అయోగ్ కేంద్ర కమిటీ అడిషనల్ కమిషనర్ డాక్టర్ సాయిబాబా, భద్రాద్రి జిల్లా డిఎంహెచ్వో తుకారం రాథోడ్ శనివారం పరిశీలించడం జరిగిందని ప్రభుత్వ ఉమ్మడి గుండాల మండలాల ప్రభుత్వ వైద్యులు డిడిఓ డాక్టర్ సుదీప్ తెలిపారు.

వెనుకబడిన మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో గుండాల మండలం ప్రత్యేకంగా భద్రాద్రి జిల్లాలో ఎంపిక చేయడంతో జరుగుతున్న పనులు అభివృద్ధి సంక్షేమ పనులను క్షుణంగా పరిశీలించారు. అనంతరం ముత్తాపురం, గుండాల, ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేశారు.

అదే క్రమంలో గుండాలలో నిర్మిస్తున్న భవనాల నిర్మాణాలు అభివృద్ధి పనులు కేంద్ర నీతి అయోగ్ కమిటీ అధికారులు ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి పలు పనులను పరిశీలించడంతో సంతృప్తి వ్యక్తం చేయడం జరిగిందన్నారు. అదేక్రమంలో మండల కేంద్రంలో వైద్య సమస్యలు నెలకొండడంతో కేంద్ర జిల్లా అధికారులకు వినతి పత్రాల ద్వారా వివరించడం జరిగిందని తెలిపారు.

Leave a Reply