పలు పాఠశాలలను పరిశీలించిన నీతి అయోగ్ అధికారులు

పలు పాఠశాలలను పరిశీలించిన నీతి అయోగ్ అధికారులు

  • గుండాల ఎంపీడీవో దుద్దుకూరు బాలరాజు

గుండాల/ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ ; గుండాల మండలంలో నీతి అయోగ్ బృందం అడిషనల్ కమిషనర్ డాక్టర్ సాయిబాబా, జిల్లా డిఎంహెచ్ఓ తుకారం రాథోడ్, జిల్లా అధికారులు నాగలక్ష్మి సంజీవరావు, లెనిన్ తెలంగాణ రాష్ట్ర నోడల్ నీతి ఆయోగ్ గుండాల మండలంలోని అంగన్వాడి కేంద్రం హైస్కూల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కేజీబీవీ పలు పాఠశాల్లను ప్రభుత్వ కార్యాలయాలు పరిశీలించడం జరిగిందని గుండాల మండల ఎంపీడీవో దుద్దుకూరు బాలరాజు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సంయుక్త అభివృద్ధి కార్యక్రమాలను నిషితంగా పరిశీలించడం జరిగిందన్నారు. పర్యటన అనంతరం గ్రామాల్లోని పలు వినతి పత్రాలను వారికి అందజేయడం జరిగిందన్నారు.పాఠశాల సమస్యలు ప్రభుత్వ ఆరోగ్య వైద్య కేంద్రంలో నెలకొన్న మార్చురి డయాలసిస్ 30 పడకల ఆసుపత్రిగా మార్చాలని పలువురు వినతి పత్రాలతో అందజేయడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా మిషన్ భగీరథ డిఈ పద్మావతి, వ్యవసాయ అధికారి వెంకటనారాయణ, మిషన్ భగీరథ ఏఈ ఇంట్రాసతీష్ రెడ్డి, ఏఈ గ్రిడ్ కాశేశ్వరరావు, సిడిపిఓ మంగతార, ఐసిడిఎస్ సూపర్వైజర్లు పుష్పవతి, అన్నపూర్ణ, ఎంఈఓ పార్వతమ్మ, మెడికల్ ఆఫీసర్ సుదీప్,కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శ్రావణి, పంచాయతీ రాజ్ డిఈ, పశు వైద్యాధికారి సురేష్, మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు పంచాయతీ కార్యదర్శి సతీష్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.