Crime | అత్యాచార ఆరోపణల కేసులో కీలక మలుపు.. వినుకొండ స్టేషన్లో లొంగిపోయిన సీఐ చినమల్లయ్య
Crime | అత్యాచార ఆరోపణల కేసులో కీలక మలుపు.. వినుకొండ స్టేషన్లో లొంగిపోయిన సీఐ చినమల్లయ్య
Crime | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్: అత్యాచార ఆరోపణల కేసులో అజ్ఞాతంలో ఉన్న సీఐ చినమల్లయ్య ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇవాళ తెల్లవారుజామున వినుకొండ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆయన లొంగిపోయినట్లు సమాచారం.
తనపై సీఐ చినమల్లయ్య అత్యాచారం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా ఏప్రిల్ 29న పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి చినమల్లయ్య అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు చినమల్లయ్య ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ ఆయనకు ఊరట లభించలేదు. అనంతరం సుప్రీంకోర్టులోనూ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, అక్కడ కూడా పిటిషన్ కొట్టివేయబడినట్లు సమాచారం.
హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురైన నేపథ్యంలో చినమల్లయ్య పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఆయనను విచారించనున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
