మాజీ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం..

బిక్కనూర్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తకు శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి .మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా కుటుంబ సభ్యులతో హైదరాబాదు నుండి నిజామాబాదుకు కారులో వెళ్తున్నారు. మండలంలోని బస్వాపూర్ గ్రామ శివారులో వెనుక నుండి అతివేగంగా వచ్చినా కంటైనర్ లారీ కారును ఢీ కొట్టింది.

దీంతో మాజీ ఎమ్మెల్యే తోపాటు వారి కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు డివైడర్ ఎక్కి 50 మీటర్ల వరకు వెళ్ళింది. దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అందులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు కారు డ్యామేజ్ అయింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న రెండు వాహనాలను తొలగించి కేసు నమోదు చేశారు. అనంతరం మరో వాహనంలో మాజీ ఎమ్మెల్యే తో పాటు వారి కుటుంబ సభ్యులను పంపించారు.