జనాభా లెక్కల సర్వేకు ప్రజలు సహకరించాలి.

జనాభా లెక్కల సర్వేకు ప్రజలు సహకరించాలి.

ఏర్గట్ల, ఆంధ్రప్రభ : ఏర్గట్ల మండలంలో 2026 జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైందని మండల తహసిల్దార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్వే నిర్వహణ కోసం ఎన్యూమరేటర్లు , ఉపాధ్యాయులు నేరుగా ప్రజల ఇళ్లకు వస్తారని, గ్రామాల్లోని ప్రజలందరూ ఎలాంటి భయాలు, అనుమానాలు లేకుండా వారికి సరైన సమాచారం అందించి సహకరించాలని ఆయన కోరారు. ఈ సర్వేలో భాగంగా గ్రామాలలోని ఇళ్ల స్థితిగతులను ఎన్యూమరేటర్లు నమోదు చేయనున్నారు.

ఇల్లు ఏ రకానికి చెందినది బిల్డింగ్, పెంకుటిల్లు, గుడిసె, ఒకే ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు అనే వివరాలు సేకరిస్తారు. వీటితో పాటు ప్రజల జీవన విధానం, వంటకు గ్యాస్ వాడుతున్నారా లేదా కట్టెలు వాడుతున్నారా, తాగునీటి సౌకర్యం ఎలా ఉంది, ఎలాంటి టాయిలెట్లు , డ్రైనేజీ వ్యవస్థలను వినియోగిస్తున్నారు వంటి కీలకమైన మౌలిక వివరాలను సర్వే బృందాలు సేకరిస్తాయని తహసిల్దార్ వివరించారు.

Leave a Reply