Sonal Chauhan| బాల‌య్య భామ‌.. బికినీ ఫోజులు

Sonal Chauhan| బాల‌య్య భామ‌.. బికినీ ఫోజులు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : మాజీ మిస్ ఇండియా సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. త‌న అందంతో తెలుగు, హిందీ, కన్నడలో చాలా సినిమాలలో నటించింది. విఎన్ ఆదిత్య తెరకెక్కించిన ‘రెయిన్ బో’ సినిమాతో సోనాల్ చౌహాన్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. కానీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెజెండ్’ మూవీతో ఈ భామకు ఒక్కసారిగా ఫేమ్ వ‌చ్చింది. బాల‌కృష్ణతో మూడు సినిమాల్లో న‌టించింది. ‘లెజెండ్’, ‘డిక్టేటర్’, ‘రూలర్’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు. అలాగే పండగ చేస్కో సినిమాతో పాటు పలు సినిమాలలో నటించారు.

ఈ ఢిల్లీ భామ సోనాల్‌ చౌహన్‌ ది ఘోస్ట్ అనే యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలో కింగ్ నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈమె ఉత్తర ప్రదేశ్‌లోని రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించారు, తండ్రి పోలీస్ ఇన్‌స్పెక్టర్. ఫెమినా మిస్ ఇండియా పోటీలలో పాల్గొన్న ఆమె, మిస్ వరల్డ్ టూరిజం 2005 కిరీటాన్ని గెలుచుకున్నారు. బాలీవుడ్‌లో ‘జన్నత్’ (2008) సినిమాతో పరిచయమయ్యారు, ఈ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నూతన నటి నామినేషన్ పొందారు. ‘3G’, ‘పల్టన్’ వంటి చిత్రాల్లో నటించారు. ఈమె నటనతో పాటు గ్లామరస్ పాత్రలకు, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.