‎summer camps | సర్వ శిక్ష అభయన్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు

‎summer camps | సర్వ శిక్ష అభయన్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు

summer camps | స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రత్యేక ప్రణాళిక
‎విద్యార్థులకు స్పోర్ట్స్ ఆథారిటీ వేసవి శిక్షణ
‎సంస్కార భారతి ద్వారా కలలపై శిక్షణ
‎మున్సిపల్ హైస్కూల్లో కరాటే శిక్షణ

summer camps | బాపట్ల బ్యూరో, ఆంధ్రప్రభ ; ‎వేసవి సెలవులు ప్రారంభమవుతున్నాయు. పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఈ సెలవుల్లో కొంత మంది పిల్లలు ఇంట్లోనే ఉంటూ రోజంతా ఆడుకుంటూ గడపాలని కోరుకుంటారు. మరికొందరు సెలవుల్లో బంధువుల ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. అయితే, వేసవి సెలవులు ప్రారంభమైన వెంటనే, తల్లిదండ్రుల టెన్షన్ కూడా పెరుగుతుంది. ఈ సెలవుల్లో పిల్లలు క్రమశిక్షణతో ఉండాలని, చదువులో వెనుకబడకూడదని వారు భావిస్తారు. అంతేకాకుండా ఎక్కడ ఎండల్లో తిరిగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారన్న భయం కూడా ఉంటుంది.

అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లలకు వేసవి సెలవులను ప్లాన్ చేసుకోవాలి. కొన్ని పనుల ద్వారా పిల్లల్ని యాక్టివ్‌గా ఉంచవచ్చు. పిల్లలు శారీరకంగా చురుకుగా ఉంచడానికి, వారికి ఏదైనా నేర్పించడానికి ప్లాన్ చేయవచ్చు. కొన్ని యాక్టివీటిస్ వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా ఏదైనా నేర్చుకోవాలన్న ఉత్సుకత కూడా వారిలో పెరుగుతుంది. వేసవి సెలవుల్లో పిల్లలను బిజీగా ఉంచడానికి ప్రభుత్వం స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇప్పటికే జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ప్రత్యేక వేసవి కార్యక్రమాల ప్రణాళిక ప్రకటించింది.

‎summer camps

స్త్రీ శిశు సంక్షేమ శాఖ చిన్నారులు పట్ల వేసవిలో తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. సర్వ శిక్ష అభియాన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న చిన్నారుల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు రోటరీ క్లబ్, సంస్కార భారతి లాంటి సంస్థలు చిన్నారులకు కలల పట్ల అవగాహన కూచిపూడి నృత్యం, కరాటే లాంటి విభిన్న రంగాలలో శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రభుత్వం వేసవిలో చిన్నారులకు ప్రత్యేక కార్యక్రమాల ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. దీనిపై జిల్లాలోని చిన్నారుల వేసవి కాలక్షేపంపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.
భాషల పై పట్టు.. భవిష్యత్తుకు మెట్టు ‎
‎ఈ రోజుల్లో ప్రతి పిల్లలకు తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ తెలిసి ఉండాలి. ఈ లాంగ్వేజ్‌ల్ని స్కూల్‌లో ఎటూ నేర్చుకుంటారు. వీటితో పాటు పిల్లలకు వేరే భాష కూడా తెలిసి ఉంటే చాలా మంచిది. భాషా పరిజ్ఞానం భవిష్యత్తులో పిల్లలకి చాలా సాయపడుతుంది. వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఏదైనా ఒక భాష నేర్పండి. వారి ఆసక్తిని బట్టి భాషను ఎంచుకోవచ్చు. జర్మన్, ఫ్రెంచ్ వంటి విదేశీ భాషలకు పాపులారిటీ ఉంది. అంతేకాకుండా మన దేశంలోని భాషలైన తమిళం, కన్నడం, గుజరాతీ వంటి వాటిని కూడా నేర్పించవచ్చు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జ్ఞాపక శక్తికి కలలు దోహదం
‎వేసవి సెలవుల్లో పిల్లల్ని డ్యాన్స్ లేదా మ్యూజిక్ తరగతుల్లో చేర్పించవచ్చు. ఈ రెండింటి వల్ల పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా పిల్లలు ఇలాంటివి నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. డ్యాన్స్ క్లాసుల్లో చేర్పిస్తే ఏదైనా ఒక నృత్య రూపాన్ని భరత నాట్యం, కథక్, కూచిపూడి, కోలాటం వంటివి నేర్చుకునేలా ప్రోత్సహించవచ్చు.

‎summer camps

డ్యాన్స్ వారి శారీరక, మానసిక అభివృద్ధికి సాయపడుతుంది. అంతేకాకుండా వారిలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. అంతేకాకుండా పిల్లలకి ప్రతిభ లేదా అభిరుచి ఉంటే వారికి సంగీతం నేర్పించవచ్చు. సంగీతం నేర్చుకోవడం ద్వారా, పిల్లలకు స్టేజ్ ఫియర్ పోవడమే కాకుండా ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. రోటరీ క్లబ్, సంస్కార భారతి ఇలాంటి సంస్థలు దీనిపై ఉచితంగా శిక్షణ అందించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
ఆత్మరక్షణకు కరాటే కర్రసాము
‎ప్రతి పిల్లలకు ముఖ్యంగా బాలికలకు, ఆత్మరక్షణ శిక్షణ ఇవ్వాలి. ఈ రకమైన శిక్షణ వారిని సురక్షితంగా ఉంచుకోవడానికి, భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఉపయోగపడుతుంది. కరాటే, కుంఫు, బాక్సింగ్, కళరిపట్టు వంటి వాటిని పిల్లలకు నేర్పిస్తే వారు శారీరకంగా దృఢంగా మారడమే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందుల్ని తప్పించుకోగలుగుతారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో కరాటే మాస్టర్ ఎర్ర నాగేశ్వరరావు ఇపురుపాలెం ప్రాంతంలో ప్రత్యేకంగా అంతరించిపోతున్న కలరిపట్టు కర్లపాలెం ప్రాంతంలో కర్ర సాము తదితర శారీరక దృఢత్వాన్ని ఇచ్చే కళలను నేర్పిస్తున్నారు.
‎అథ్లెటిక్స్ పై అవగాహన
‎వేసవి సెలవులు అంటే పిల్లలకు ఆడుకోవడం, గెంతడం. పిల్లల్ని ఈ వేసవి సెలవుల్లో ఆడుకోనివ్వండి. కావాలంటే ఏదైనా ఒక క్రీడ లేదా గేమ్ నేర్చుకునేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వవచ్చు. ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్, క్రికెట్ ఏదైనా ఒక క్రీడలో వారు రాటుదేలేలా శిక్షణ ఇప్పించండి. క్రీడల వల్ల పిల్లలు శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్ అవుతారు. అంతేకాకుండా ఫలానా క్రీడలో వారికి ఆసక్తి ఉంటే ఆ దిశగా ప్రోత్సహించండి. పిల్లల టాలెంట్‌ని గుర్తించి వారికి ప్రోత్సహం ఇస్తే ఉత్తమంగా ఎదుగుతారు.

‎summer camps

జిల్లా స్పోర్ట్స్ అథారిటీ జిల్లా వ్యాప్తంగా పలు క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది ముందుగా ఎంపిక చేసిన యువతను తీసుకొని వారికి ఇష్టమైన క్రీడలలో శిక్షణ కల్పించడానికి కృషి చేస్తున్నారు. పిల్లలకు గార్డెనింగ్‌లో మెళుకువలు నేర్పించండి. పిల్లలకు మొక్కలు, చెట్ల ప్రాముఖ్యత తెలిసేలా చేయండి. పర్యావరణం మానవాళికి ఎంతో కీలకమైందో వివరించండి. అంతేకాకుండా వారి చేత మొక్కలు నాటించడం, తోట పని చేయించడం, మొక్కలకు నీరు పోయించడం వంటి పనులు చేయించండి. దీంతో, వారు పర్యావరణ ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు.

మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న పోటీ పిల్లలను వారి మూలాల నుంచి దూరం చేశాయనడంలో ఎటువంటి సందేహం లేదు. పిల్లలు ప్రకృతిని ఆస్వాదించలేకపోతున్నారు. ఎయిర్ కండిషన్డ బస్సుల్లో, తరగతి గదుల్లో నివసించడానికి పిల్లలు ఎంతగా అలవాటు పడ్డారంటే, కొంచెం తీవ్రమైన వేడిని కూడా తట్టుకోలేకపోతున్నారు. అందుకే పిల్లల్ని నేచురల్ క్యాంప్స్, వర్క్‌షాపుల్లో పాల్గొనేలా ప్రోత్సహించండి. ప్రకృతికి మించిన మంచి స్నేహితుడు పిల్లలకు ఎవరు దొరుకుతారు. ప్రకృతిని చూసి వారికి ఏదైనా కొత్తది నేర్చుకోవాలన్న ఉత్సుకత పెరుగుతుంది. ఇప్పటినుండి ఈ వేసవికి అద్భుత ప్రణాళికల రూపొందిస్తూ భవిష్యత్తుకు పునాది వేసేలా ప్రభుత్వం స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. వీటిని జిల్లాలోని ప్రజలు సక్రమంగా వినియోగించుకొని వారి పిల్లల భవిష్యత్తుకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

click here to read

click here to read more