Sing geetham cinema review | మాటలు లేవు.. అంతా పాటలే! సినిమా ఎలా ఉందంటే?

Sing geetham cinema review | మాటలు లేవు.. అంతా పాటలే! సినిమా ఎలా ఉందంటే?

Sing geetham cinema review | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: తెలుగు సినీ పరిశ్రమలో ప్రయోగాలకు చిరునామా.. సింగీతం శ్రీనివాస రావు. ఆయన గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 94 ఏళ్ల వయసులో ఆయన కొత్త ఆలోచనతో మళ్లీ మన ముందుకు తీసుకు వచ్చిన సినిమా ‘సింగ్‌ గీతం’. మాటలు లేకుండా సినిమా తీసిన దర్శకుడికి.. పాటలతో సినిమా తీయడం కష్టమా.. చెప్పండి. అంతే అలవోకగా ‘సింగ్‌ గీతం’ సినిమాను తీర్చిదిద్దారు దర్శకులు సింగీతం. ఈ చిత్రం (జూన్‌ 12)న నేడు సినిమా థియేటర్లలో విడుదలైంది. అసలు సినిమా ఎలా ఉంది? సింగ్‌ గీతంతో సింగీతం చేసిన మ్యాజిక్‌ మెప్పించిందా? అనే విషయాలు ఈ సమీక్షలో చూద్దాం..

Sing geetham cinema review | కథ ఏంటంటే..

ప్రతాప్ అనే యువకుడు తన జీవితంలో ఒక కొత్త మార్పు కోసం ఊరిని వదిలి బయలుదేరుతాడు. మంచి జీవితం, కొత్త అవకాశాలు, తనకంటూ ఒక దారి వెతుక్కోవాలనే ఆశతో కుబేరపురం అనే గ్రామానికి చేరుకుంటాడు. మొదట్లో ఆ గ్రామం అతనికి ప్రశాంతంగా, సాధారణంగా కనిపిస్తుంది. కానీ క్రమంగా అక్కడి మనుషులు, వారి ప్రవర్తన, గ్రామంలో జరిగే కొన్ని విచిత్రమైన సంఘటనలు అతనికి అనుమానాలు కలిగిస్తాయి.

ఆ ఊరిలో ప్రతి వ్యక్తి వెనుక ఒక కథ ఉంటుంది. బయటకు కనిపించేది ఒకలా ఉన్నా, లోపల దాగి ఉన్న నిజాలు మరోలా ఉంటాయి. ప్రతాప్ ఆ గ్రామంలోకి అడుగుపెట్టిన తర్వాత అతని చుట్టూ జరిగే సంఘటనలు ఒక్కొక్కటిగా అతని జీవితాన్ని మార్చడం ప్రారంభిస్తాయి. సంగీతం, భావోద్వేగం, ఫాంటసీ అంశాలు కలిసి అతన్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి.

ప్రతాప్ అక్కడికి ఎందుకు వచ్చాడు? ఆ గ్రామంలో దాగి ఉన్న మిస్టరీ ఏమిటి? అతనికి ఎదురయ్యే వ్యక్తులు అతని ప్రయాణాన్ని ఎలా మార్చారు? సంగీతం ఈ కథలో ఎందుకు కీలకంగా మారింది? చివరికి ప్రతాప్ తన జీవితానికి సంబంధించిన ఏ నిజాన్ని తెలుసుకున్నాడు? అన్నదే ‘సింగ్ గీతం’ కథ.

Sing geetham cinema review | సింగీతం మార్క్ కనిపించిందా?

సింగీతం శ్రీనివాసరావు సినిమాలంటే ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అంచనాతోనే సినిమాకు వెళ్లారు. ఆయన కథల్లో ప్రయోగం ఉంటుంది. సాధారణ దారిలో కాకుండా కొత్త కోణంలో కథ చెప్పాలనే ప్రయత్నం ఉంటుంది. ‘సింగ్ గీతం’లో కూడా అదే స్పష్టంగా కనిపిస్తుంది. 94 ఏళ్ల వయసులోనూ ఆయన కొత్త తరానికి కొత్త కథ చెప్పాలని చేసిన ప్రయత్నం అభినందనీయం.

అయితే సినిమా ప్రారంభంలో చాలా ఇంట్రెస్టింగ్‌గా సినిమా ప్రారంభం అవుతుంది. తొలి 20 నిమిషాలు.. మాటలతో సాగినా.. ఎప్పుడైతే కుబేరపురం చేరుతుందో.. అప్పుడు అసలు కథలోకి అడుగు పెడుతుంది. ఇక అక్కడి నుంచి దాదాపు 2 గంటల పాటు పాటలతోనే సినిమా ఉంటుంది. ఇక మొదట్లో పాటలతో నడుస్తుంటే ఇబ్బందిగా అనిపించినా.. ప్రథమార్థం విరామంతో సినిమా మలుపు బాగుంటుంది. ద్వితీయార్థం కాస్త నెమ్మదించినా ముగింపు సన్నివేశానికి చేరే సమయానికి సినిమా ఎమోషనల్‌గా మారిపోతుంది. మనిషి తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతికి చేసే వినాశనాన్ని చాలా బాగా చూపించారు. ఈ సినిమాలో వచ్చే ఓ బిగ్‌ హీరో క్యామియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కానీ రెగ్యులర్‌ కమర్షియల్ సినిమాలు చూసే వారికి కొంత నెమ్మదిగా అనిపించే అవకాశం ఉంది.

Sing geetham cinema review | నటీనటులు ఎలా చేశారంటే..
ఈ సినిమాకు అంతా కొత్త నటులే కావడం సినిమాకు ప్రధాన బలం. ఆయన్. కె ప్రధాన పాత్రలో కనిపించాడు. తన పాత్రను సహజంగా చేయడానికి ప్రయత్నించాడు. షాలిని కొండెపూడి, అహల్య బమ్రూ తమ పాత్రల పరిధిలో బాగానే కనిపించారు. శివ నారాయణ, బెనర్జీ వంటి అనుభవజ్ఞులు కథకు అవసరమైన స్థిరత్వాన్ని ఇచ్చారు.

Sing geetham cinema review | దేవి మ్యూజిక్ పెద్ద బలం..
ఈ సినిమాకు ప్రధాన బలం సంగీతమే. సినిమా పేరులోనే “గీతం” ఉండటంతో, పాటలు కథలో కీలకంగా పనిచేయాలి. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ తప్ప ఇక ఎవ్వరూ మ్యూజిక్‌ ఇవ్వలేరేమో అన్నట్లు అనిపిస్తుంది. సినిమా కోసం దేవి ప్రాణం పెట్టాడు అని చెప్పాలి. దాదాపు 2 గంటల పాటు పాటలతో సినిమా అంటే దేవి తన భుజాల మీద వేసుకొని నడిపించాడు.

ప్లస్ పాయింట్స్:

సింగీతం శ్రీనివాసరావు ప్రయోగం

మ్యూజికల్ ఫాంటసీగా కథ చెప్పాలనే కొత్త ప్రయత్నం.

దేవి పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ సినిమాకు ప్రధాన బలం.

రెండో భాగంలో చాలా ఎమోషనల్‌గా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

మైనస్ పాయింట్స్:

సినిమా కథలోకి చాలా నెమ్మదిగా వెళ్లడం. ప్రధానంగా మొదటి భాగంలో..

కొన్ని సన్నివేశాలు ఇంకా బాగా తీసి ఉండవచ్చు.

సినిమాలో ఉండే గ్రామం న్యాచురల్ గా కాకుండా సెట్ వేసినట్లు తెలిసిపోతూ ఉంటుంది.

చివరిగా..
ఏమైంది.. ఏమైంది.. సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది.

‘సింగ్ గీతం’ ఇది రెగ్యులర్‌ సినిమా కాదు. 40 ఏళ్ల కిందట ఓ లెజెండ్‌ దర్శకుడికి వచ్చిన ఆలోచనను ఈ తరానికి నచ్చేలా సింగీతం శ్రీనివాసరావు చేసిన మరో ప్రయోగాత్మక ప్రయత్నం. కొత్త తరహా కథలు, మ్యూజికల్ ఫాంటసీ సినిమాలు ఇష్టపడేవారికి ‘సింగ్ గీతం’ ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్ ఇస్తుంది.

రేటింగ్
3/5

గమనిక: ఈ సమీక్ష రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. సినిమా పట్ల ప్రేక్షకుల అభిరుచులు, అంచనాల ఆధారంగా మారవచ్చు.

CLICK HERE TO READ sanya malhotra| ‘దంగల్’ నుంచి ‘జవాన్’..

CLICK HERE TO READ MORE

Leave a Reply