డీఎం హెచ్ వోగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ పవిత్ర
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా డీఎంహెచ్వోగా డాక్టర్ పవిత్ర గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఈ పదవిలో పనిచేసిన డాక్టర్ స్వర్ణకుమారి రంగారెడ్డి జిల్లాకు బదిలీ కావడంతో, ఆమె స్థానంలో డాక్టర్ పవిత్రను నియమించారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం డాక్టర్ పవిత్ర జిల్లా కలెక్టర్ దీపక్ తివారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
