మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి

మరిపెడ, ఆంధ్రప్రభ : మండలంలో ఇటీవల మరణించిన గడ్డం పుల్లమ్మ కుటుంబాన్ని సోమవారం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. మండలంలోని గుండెపుడి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ ఉపసర్పంచ్ గడ్డం ఉపేందర్ రెడ్డి తల్లి పుల్లమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లి పుల్లమ్మ చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె వెంట గ్రామ సర్పంచ్ లకావత్ రవికుమార్, గాయం జగదీశ్వర్ రెడ్డి, గంట్ల పాపిరెడ్డి,పులుసు వెంకన్న, వార్డు మెంబర్ పసునూటి వెంకటరెడ్డి, పంతుల్య, కోట వెంకటరెడ్డి, గంట్ల నరేష్ రెడ్డి, శేషి రెడ్డి, రేఖ వెంకటనారాయణ, లింగాల బాబు, సాయిలు, రవి, దుబాక్ సురేష్, బోడపట్ల శ్రీను, షేక్ యాకూబ్ అలి,తదితరులు పాల్గొన్నారు.