తిమ్మాపూర్ లో విత్తన మేళా..

  • హాజరైన ప్రజాప్రతినిధులు, రైతులు

కొత్తూరు, ఆంధ్రప్రభ : కొత్తూరు మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో గల రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి గోపాల్ ఆధ్వర్యంలో మంగళవారం విత్తన మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మక్తగూడ సర్పంచ్ బోకుల శ్రీరాములు, మండల వ్యవసాయ అధికారి గోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. రైతులు అధిక దిగుబడులు ఇచ్చే పంట రకాలను ఎంపిక చేసుకోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

ఈ సందర్భంగా రైతులకు వరి సన్న రకాలైన RNR-15048 (తెలంగాణ సోనా), KNM-1638, HMT సోనా, WGL-44, KNM-7715, BPT-5204 తదితర విత్తనాలతో పాటు మొక్కజొన్న, జొన్న, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయల విత్తనాలు, నానో యూరియా, నానో డీఏపీ ఎరువులను ప్రదర్శించారు. ఎమ్మెల్యేలు , ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం విధంగా జూన్ 23 నుండి 30 వరకు రైతు వేదికల ద్వారా విత్తనాల పంపిణీ చేపడుతోందని తెలిపారు.

రైతులు, వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకొని అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకొని ప్రభుత్వ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మక్తగూడ సర్పంచ్  బోకుల శ్రీరాములు, నాయకులు మల్లారెడ్డి, మైసగళ్ల రమేష్, గోనెల ఆంజనేయులు, వ్యవసాయ విస్తరణ అధికారులు సమీన, నిఖిల్, డీలర్లు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.